యూఎస్ సర్జన్‌ జనరల్గా వివేక్‌ మూర్తి

తాజా వార్తలు

Updated : 24/03/2021 18:28 IST

యూఎస్ సర్జన్‌ జనరల్గా వివేక్‌ మూర్తి

వాషింగ్టన్‌: ప్రవాస భారతీయ వైద్యుడు వివేక్‌ మూర్తి అమెరికా సర్జన్‌ జనరల్‌గా మరోసారి నియమితులయ్యారు. డాక్టర్‌ వివేక్‌ మూర్తి నియామకాన్ని 57-43 ఓట్లతో అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. 43 ఏళ్ల వివేక్‌ మూర్తి అమెరికా సర్జన్‌ జనరల్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఒబామా ప్రభుత్వ హయాంలోనూ యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా ఆయన పనిచేశారు. 37 ఏళ్ల వయసులోనే సర్జన్‌ జనరల్‌గా నియమితులైన వివేక్‌ మూర్తి.. చిన్న వయసులోనే ఆ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ట్రంప్‌ హయాంలో మూర్తి ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. 

రెండోసారి యూఎస్‌ సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన వివేక్‌ మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. ‘నాపై నమ్మకముంచి నాకు సర్జన్‌ జనరల్‌ బాధ్యతలు అప్పగించినందుకు సెనేట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. కరోనా కారణంగా ఏడాది కాలంగా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కఠిన పరిస్థితుల నుంచి దేశాన్ని కోలుకునేలా చేసి.. పౌరుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని