ఇది అమెరికా.. చైనా కాదు!

తాజా వార్తలు

Updated : 09/01/2021 20:10 IST

ఇది అమెరికా.. చైనా కాదు!

ట్రంప్ ట్విటర్ ఖాతాను నిషేధించడంపై రిపబ్లికన్ల స్పందన

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించడాన్ని రిపబ్లికన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రిపబ్లికన్ నేత, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ట్విటర్ చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఇది అమెరికా.. చైనా కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో..ట్రంప్ తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందంటూ ట్విటర్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

‘ప్రజలను మాట్లాడకుండా చేసేది చైనాలో. మన దేశంలో కాదు. నమ్మశక్యంగా లేదు’ అని నిక్కీ హేలీ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన క్యాపిటల్ భవనం దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ అంతర్గత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్యాపిటల్ భవనంపైకి దాడి చేసేలా ప్రేరేపించిన ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఎప్పుడూ సరైన పదాలను ఉపయోగించలేదన్నారు. ఆయన చర్యలను చరిత్ర కఠినంగా పరిగణిస్తుందని వ్యాఖ్యానించారు. నిక్కీ ఐరాసలో యూఎస్‌ రాయబారిగా విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

ట్రంప్‌పై ట్విటర్ శాశ్వత నిషేధం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని