భారత్‌-యూఎస్ రక్షణ భాగస్వామ్యం భేష్‌‌!

తాజా వార్తలు

Published : 20/03/2021 11:39 IST

భారత్‌-యూఎస్ రక్షణ భాగస్వామ్యం భేష్‌‌!

దిల్లీ: ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌, అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని యూఎస్‌ రక్షణ మంత్రి జేమ్స్‌ ఆస్టిన్‌ ప్రశంసించారు. ఆస్టిన్‌ శుక్రవారం రాత్రి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం సమావేశానికి సంబంధించిన విషయాల్ని ట్విటర్‌లో వెల్లడించారు. ‘భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో గొప్ప సమావేశం జరిగింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కీలకమైన సవాళ్లపై రెండు దేశాలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఈ సహకారమే రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం ప్రాధాన్యతను తెలియజేస్తోంది’ అని ఆస్టిన్‌ ట్వీట్‌లో తెలిపారు.

మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ ఆస్టిన్‌ శుక్రవారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన నిన్న సాయంత్రం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆస్టిన్‌తో మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను తెలిపారు. అంతేకాకుండా అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేయమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని