అమెరికా క్యాపిటల్‌ భవనంలో కాల్పులు

తాజా వార్తలు

Updated : 07/01/2021 12:46 IST

అమెరికా క్యాపిటల్‌ భవనంలో కాల్పులు

అమెరికా: అమెరికా క్యాపిటల్‌ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలో ఆమె మెడపై తూటా గాయమైంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే  బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో  పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ను సైతం ప్రయోగించారు. ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్‌ గెలుపు ధ్రువీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. దీంతో ఆందోళనకారులను కట్టడిచేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ట్రంప్‌ ఆదేశాలతో కేంద్రబలగాలను రంగంలోకి దించినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. క్యాపిటల్‌ భవనంలో అందరూ సంయమనం పాటించాలంటూ ట్రంప్‌ హితవు పలికారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. 


ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెంటనే ఆందోళనకారులు క్యాపిటల్‌ భవనం విడిచివెళ్లాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ స్పందించారు. ఈ చర్యను ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను ఆపడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్‌ వెంటనే జాతీయ ఛానల్‌లో ప్రకటన చేయాలని’ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు వాషింగ్టన్‌ మేయర్‌ బౌజర్‌ నగరంలో కర్ఫ్యూ విధించారు. అత్యవరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రక్షణ బలగాలు క్యాపిటల్‌ భవనంను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.   


ఇవీ చదవండి..

జాక్‌ మాది అజ్ఞాతమా..? నిర్బంధమా?

పెన్స్‌కు ‘ట్రంప్‌’ తలనొప్పి!

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని