Auto Ambulance: దిల్లీలో ఆటో అంబులెన్స్‌లు

తాజా వార్తలు

Published : 06/05/2021 14:20 IST

Auto Ambulance: దిల్లీలో ఆటో అంబులెన్స్‌లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలో టర్న్‌ యువర్‌ కన్సర్న్‌ ఇన్‌ టూ యాక్షన్‌ (టీవైసీఐఏ) సంస్థ  రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్‌లను సిద్ధం చేసింది. దేశంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరిగి ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. టీవైసీఐఏ సంస్థ రాజ్యసభతో కలిసి 10 ఆటో అంబులెన్స్‌ను సిద్ధం చేసింది.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్‌ పేషెంట్లను ఈ ఆటోరిక్షాల్లో ఆసుపత్రులకు చేరుస్తారు. ఈ ఆటో రిక్షాలు నిత్యం పూర్తిగా శానిటైజ్‌ చేసి ఆక్సిజన్‌తో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని టీవైసీఐఏ సంస్థ ట్విటర్లో షేర్‌ చేసింది. ఈ ఆటో అంబులెన్స్‌ సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. రూ.25 లక్షల నిధులను సమీకరించి దేశ వ్యాప్తంగా ఇటువంటి ఆటో అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 

దేశంలో నేడు అత్యధికంగా 4.12 లక్షల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే తీవ్రత కొనసాగితే జూన్‌ 11 నాటికి కొవిడ్‌ మరణాలు 4.04లక్షలను దాటేస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ బృందం పేర్కొంది. ఇక అమెరికాలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మ్యాట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ సంస్థ జులై చివరి నాటికి మృతుల సంఖ్యను 10లక్షలను దాటుతుందని పేర్కొంటోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని