వారణాసిలో కుప్పకూలిన భవంతి.. ప్రధాని ఫోన్‌

తాజా వార్తలు

Published : 01/06/2021 21:51 IST

వారణాసిలో కుప్పకూలిన భవంతి.. ప్రధాని ఫోన్‌

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌లో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ కౌశల్‌ రాజ్‌ శర్మతో ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారని, అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ట్విటర్‌ ద్వారా కలెక్టర్‌ వెల్లడించారు. వారణాసి ఆలయ సీఈవో ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని