ప్రచార బరిలోకి దిగనున్న ట్రంప్‌!

తాజా వార్తలు

Published : 10/10/2020 12:14 IST

ప్రచార బరిలోకి దిగనున్న ట్రంప్‌!

వాషింగ్టన్‌: కరోనా చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి బయటకు రానున్నారు. శ్వేతసౌధం ప్రాంగణంలో శనివారం బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించారు. అనంతరం సోమవారం అధికారికంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 

శనివారం జరిగే కార్యక్రమంలో బాల్కనీ నుంచే ట్రంప్‌ ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. అలాగే సోమవారం జరగబోయే ప్రచార కార్యక్రమంలో ప్రతిఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడంతో పాటు వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని నిర్ణయించారు. కరోనా సోకడంతో గత 10 రోజులుగా ట్రంప్‌ ప్రచార కార్యక్రమాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఆయన తరఫున వారసులు ఇవాంక ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఇదీ చదవండి...
రెండో సంవాదం లేదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని