ట్రంప్‌ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం

తాజా వార్తలు

Updated : 14/01/2021 11:11 IST

ట్రంప్‌ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం


వాషింగ్టన్‌: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవినుంచి దిగిపోనున్న ట్రంప్‌ మరో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటనను ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్‌ అపఖ్యాతి పాలయ్యారు. అభిశంసన తీర్మానంపై సెనెట్‌లో తదుపరి చర్చ జరగనుంది. 

జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులకు, ట్రంప్‌ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం  ప్రవేశపెట్టారు. 25 రాజ్యంగా సవరణ చట్టం కింద ఉపాధ్యక్షుడు, క్యాబినెట్‌లోని మెజారిటీ సభ్యులు తీర్మానించడం ద్వారా అధ్యక్షుడిని తొలగించే వీలుంది. సోమవారమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా, రిపబ్లిక్‌ సభ్యులు అడ్డుకున్నారు. 25 సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సుముఖంగా లేనంటూ ఉపాధ్యక్షుడు పెన్స్‌ ఇదివరకే సంకేతాలిచ్చారు. అయినా సరే స్పీకర్‌ పెలోసీ పట్టుబట్టి మరీ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. అయితే తీర్మానాన్ని ఉపాధ్యక్షుడు పెన్స్‌ తోసిపుచ్చారు. దీంతో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సోమవారం ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చ సాగింది.


చర్చ అనంతరం ప్రతినిధుల సభలో 232-197 ఓట్లతో అభిశంసన తీర్మానం నెగ్గింది. ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన 10మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు ప్రతినిధుల సభలో ఓటింగ్‌లో పాల్గొనలేదు. నలుగురు ఇండో అమెరికన్‌ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటేశారు. ఈ తీర్మానంపై సెనెట్‌ ఓటింగ్‌ నిర్వహించనుంది. సెనెట్‌లో ఆమోదం పొందితే ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. సెనెట్‌ ఈనెల 19కి వాయిదా పడింది. సెనెట్‌లో ఆమోదం పొందడానికి డెమొక్రాట్లకు 17 ఓట్లు అవసరం. జనవరి 20న బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం ట్రంప్‌పై విచారణ జరగనుంది.  ఇవీ చదవండి..
హతవిధి.. ట్రంప్‌ పరిస్థితి..!

ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిలిపివేతAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని