Mamatha Benerjee: పశ్చిమబెంగాల్‌లో ‘ఖేలే హోబే దివస్‌’ వేడుకలు

తాజా వార్తలు

Published : 16/08/2021 23:40 IST

Mamatha Benerjee: పశ్చిమబెంగాల్‌లో ‘ఖేలే హోబే దివస్‌’ వేడుకలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘ఖేలే హోబే దివస్‌’ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించింది. పార్టీ నాయకులు రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను ఏర్పాటు చేసి క్రీడాకారులకు సామగ్రిని అందజేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 'ఖేలా హోబే దివస్' వేడుకలను నిర్వహించాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ, కొన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో అనుమతి లభించలేదు. దీనిపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం’ అని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ అన్నారు.

గత నెలలోనే సీఎం మమతా బెనర్జీ ఆగస్టు 16న ‘ఖేలే హోబే దివస్‌’ను నిర్వహించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. 1980లో ఇదే రోజున కోల్‌కతాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ తొక్కిసలాటలో 16మంది క్రీడాకారులు మరణించారు. వారి గౌరవార్థం ఈ వేడుకలను నిర్వహించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే, భాజపా మాత్రం దీనిపై విమర్శలు గుప్పించింది. ‘పశ్చిమబెంగ బచావో దివస్‌’ను జరపాలని టీఎంసీపై ధ్వజమెత్తింది.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఖేలా హోబే’ నినాదం ఎంతో పాపులర్‌ అయ్యింది. ఈ నినాదంతోనే దీదీతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడోసారి టీఎంసీ అధికారాన్ని దక్కించుకుంది. 294 అసెంబ్లీ సీట్లకు గానూ 213 స్థానాల్లో గెలుపొందింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఎదగడానికి టీఎంసీ ప్రణాళికలు రచిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని