Governors transferred: పలు రాష్ట్రాల గవర్నర్‌లు బదిలీ

తాజా వార్తలు

Updated : 09/09/2021 23:54 IST

 Governors transferred: పలు రాష్ట్రాల గవర్నర్‌లు బదిలీ

దిల్లీ: పలు రాష్ట్రాలకు గవర్నర్‌లు మారారు. పలువురు గవర్నర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు విడుదల చేసింది. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరీలాల్‌ పురోహిత్‌ పంజాబ్‌కు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు బన్వరీలాల్‌ పురోహిత్ పంజాబ్‌ అదనపు బాధ్యతలు చూశారు. నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి తమిళనాడు గవర్నర్‌గా నియామకమయ్యారు. విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా నియామకమయ్యారు. అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి నాగాలాండ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబి రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని