అంతవరకు హెచ్‌1బి వీసాలివ్వొద్దు

తాజా వార్తలు

Published : 12/02/2021 12:40 IST

అంతవరకు హెచ్‌1బి వీసాలివ్వొద్దు

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసానికి లేదా గ్రీన్‌ కార్డుల జారీకి ఉన్న పరిమితిని తొలగించేవరకు భారత్‌లో పుట్టినవారికి హెచ్‌-1బి వర్క్‌ వీసాలు ఇవ్వొద్దంటూ.. భారతీయ-అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఇమ్మిగ్రేషన్‌ వాయిస్‌’ బైడెన్‌ ప్రభుత్వానికి గురువారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితి ప్రకారం గ్రీన్‌ కార్డుల కోసం భారతీయ వృత్తి నిపుణులు.. ప్రధానంగా ఐటీ రంగానికి చెందిన ఎందరో దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొత్త హెచ్‌-1బి విధానం అమలు డిసెంబర్‌ 31కి వాయిదా

లాటరీ పద్ధతిలో కాకుండా జీతాలను బట్టి హెచ్‌-1బి వీసాలను జారీచేసే విధానాన్ని అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్‌ 31కి వాయిదా వేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. ఈ వీసాల జారీకి ఇప్పటివరకూ అమలు చేస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసి.. అధిక వేతనాలు వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని తొలుత ఆ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం దాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 31కి వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి..

జిన్‌పింగ్‌కు కాల్‌ చేసిన బైడెన్‌..

అమెరికాలో మంచు తుఫాను..130 వాహనాలు ఢీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని