గోవా ఆస్పత్రిలో మృత్యుహేళ: మరో 13 మంది మృతి

తాజా వార్తలు

Published : 14/05/2021 12:37 IST

గోవా ఆస్పత్రిలో మృత్యుహేళ: మరో 13 మంది మృతి

పనాజీ: గోవా వైద్య కళాశాల ఆస్పత్రి(జీఎంసీహెచ్‌)లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్‌ సరఫరా లేక శుక్రవారం మరో 13 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ బాంబే హైకోర్టులోని గోవా బెంచ్‌కు వెల్లడించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో 70 మందికి పైగా మృతిచెందడం విచారకరం.

గత మంగళవారం ఇదే ఆస్పత్రిలో 26 మంది, బుధవారం 20 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గురువారం తెల్లవారుజామున 15 మంది, ఈ ఉదయం మరో 13 మంది కన్నుమూశారు. ఆక్సిజన్‌ సరఫరా అందుబాటులో లేకపోవడంతోనే వీరంతా మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రాణవాయువు సిలిండర్ల రవాణాలో ఎదురైన కొన్ని సమస్యల కారణంగానే ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో చోటుచేసుకుంటున్న మరణాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా.. జీఎంసీహెచ్‌ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 

గోవాలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. అక్కడ సగటున రెండు పరీక్షల్లో ఒకటి పాజిటివ్‌గా వస్తోంది. గురువారం రాష్ట్రంలో 2,491 కొత్త కేసులు నమోదవ్వగా.. 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని