వాతావరణ హెచ్చరికలు కాదు.. కరోనా ఘంటికలు!

తాజా వార్తలు

Updated : 13/07/2021 19:59 IST

వాతావరణ హెచ్చరికలు కాదు.. కరోనా ఘంటికలు!

అప్రమత్తంగా ఉండాలన్న లవ్‌ అగర్వాల్‌ 

దిల్లీ: దేశంలో పలుప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధన ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే వైరస్‌ కట్టడిలో ఇప్పటివరకు సాధించిన ఫలితమంతా వృథా అవుతుందని హెచ్చరించింది. దేశంలో కరోనా పరిస్థితిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ తీవ్రతను అర్థంచేసుకోవడంలో ప్రజలు విఫలమవుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. 

 

‘‘మేం రెండేళ్ల తర్వాత తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తోంది. భారీ జన సమూహాలు ఉన్నా మేం కరోనాకు భయపడం. థర్డ్‌ వేవ్‌ కన్నా ముందే మేం ఇక్కడికి వచ్చాం’ వంటి ప్రవర్తన కరోనా మూడో దశకు కారణం కావొచ్చని లవ్‌ అగర్వాల్‌ అన్నారు.  థర్డ్‌ వేవ్‌ గురించి వాతావరణ అప్‌డేట్‌లా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. కానీ, కరోనా నిబంధనలు పాటించడం ఎంత అవసరమో అర్థంచేసుకోవడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నామన్నారు. దేశంలో దాదాపు 73.4% కొత్త కేసులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలోనే నమోదవుతున్నట్టు తెలిపారు. జులై 13 నాటికి 55 జిల్లాల్లో 10శాతం కన్నా అధికంగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌ సహా 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపినట్టు చెప్పారు. దేశంలో పలుచోట్ల కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్షించినట్టు తెలిపారు. 

మరోవైపు, ప్రపంచ దేశాల్లో మూడో దశ కనబడుతుందని, ఇది భారత్‌లో రాకుండా ఉండాలంటే కొవిడ్‌ నిబంధనల్ని కఠినంగా పాటిస్తూ ప్రజలంతా ఐక్యంగా కృషిచేయాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని