UN Chief: విపత్తుగా మారకముందే.. మయన్మార్‌ను ఆదుకోండి: ఐరాస చీఫ్‌ పిలుపు

తాజా వార్తలు

Published : 01/10/2021 23:34 IST

UN Chief: విపత్తుగా మారకముందే.. మయన్మార్‌ను ఆదుకోండి: ఐరాస చీఫ్‌ పిలుపు

న్యూయార్క్‌: మయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అవి విపత్తుగా మారకముందే అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి విపత్తును ఎదుర్కోవడం కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశాల్లో సెక్రటరీ జనరల్‌ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాలనను సైన్యం తన అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వారిని అణచివేసేందుకు సైన్యం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐరాస నివేదిక ప్రకారం ఇప్పటివరకు అక్కడ 1100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8000 మందిని అరెస్టు చేయగా వారిలో కస్టడీలోనే దాదాపు 120 మంది మరణించారు. వీటికి తోడు కొవిడ్‌ విజృంభణ, రోజురోజుకు పతనమవుతున్న ఆహార భద్రత, భారీ సంఖ్యలో వలసలతో పాటు ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోతున్నట్లు ఐరాస వెల్లడించింది. ఇలాంటి సమయంలో మయన్మార్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఐరాస చీఫ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా అక్కడ శాంతిని నెలకొల్పే లక్ష్యంతో పొరుగు దేశాలు కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని