Farm Laws: సాగు చట్టాలను ఉపసంహరించాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

తాజా వార్తలు

Published : 29/08/2021 01:23 IST

Farm Laws: సాగు చట్టాలను ఉపసంహరించాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శనివారం తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. వ్యవసాయం, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖలపై చర్చల కోసం అసెంబ్లీ సమావేశమైన వెంటనే తీర్మానాన్ని ప్రతిపాదించిన సీఎం స్టాలిన్.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేయగా.. సభ ఆమోదం తెలిపింది.

తమిళనాడు చరిత్రలో ఇది ముఖ్యమైన రోజు అని.. ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడేందుకు ఈ తీర్మానం ఆమోదించాలని స్టాలిన్‌ సభను కోరారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులు, వ్యవసాయాన్ని ఆదుకోవడంలో విఫలమయ్యాయని.. ఇలాంటి చట్టాలను వ్యతిరేకించడం మన బాధ్యత అని  పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 380 రోజులకుపైగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం సభను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఇలాంటి ఇలాంటి చట్టాలు తీసుకువచ్చారని.. ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చట్టాలని పేర్కొన్నారు.

ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష ఏఐడీఎంకే, భాజపా కూటమి సభ నుంచి వాకౌట్ చేసింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి, చర్చ చేపట్టకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తొందర పాటుతో తీర్మానాన్ని ఆమోదించిందని అన్నాడీఎంకే సభ్యులు ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని