అర్హులు కాని రైతులకు రూ.3000 కోట్ల బదిలీ!

తాజా వార్తలు

Updated : 20/07/2021 17:39 IST

అర్హులు కాని రైతులకు రూ.3000 కోట్ల బదిలీ!

రికవరీ చేస్తున్నామన్న కేంద్రం

దిల్లీ: ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద కేంద్రం ఏటా రైతులకు అందించే పెట్టుబడి సాయంలో కొన్ని పొరబాట్లు చోటుచేసుకున్నాయి. అర్హులు కాని రైతులకు కూడా ఈ సాయం అందినట్లు తెలిపింది. దీన్ని గుర్తించిన కేంద్రం రికవరీ మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 42లక్షలకు పైగా అర్హులు కాని రైతులకు దాదాపు రూ.3వేల కోట్లు బదిలీ అయినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌కు తెలిపింది. 

‘‘పెట్టుబడి సాయానికి అర్హులు కాని 42.16లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్‌ పథకం ద్వారా రూ. 2,992కోట్లు బదిలీ అయ్యాయి. దీంతో ఆ మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేస్తున్నాం’’ అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. అత్యధికంగా అస్సాంలో 8.35లక్షల మంది అనర్హులకు పీఎం-కిసాన్‌ సాయం కింద రూ.554కోట్లు అందినట్లు తెలిపారు. ఆ తర్వాత తమిళనాడులో 7.22లక్షలు, పంజాబ్‌లో 5.62లక్షలు, మహారాష్ట్రలో 4.45లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 2.65లక్షలు, గుజరాత్‌లో 2.36లక్షల మంది అర్హులు కాని రైతులు పెట్టుబడి సాయం పొందినట్లు చెప్పారు. ఆ రైతుల నుంచి డబ్బు రికవరీ చేసుకునేందుకు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. 

పేద రైతులకు పెట్టబడి సాయం అందించేందుకు కేంద్రం పీఎం-కిసాన్‌ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఏటా రైతులకు రూ.6000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. అయితే ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్నవారు, ఆదాయపు పన్ను లేని రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. కాగా, ఇటీవల లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తుండగా.. కొందరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులకు కూడా సాయం అందినట్లు తేలింది. దీంతో ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని