President Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కంటికి శస్త్రచికిత్స

తాజా వార్తలు

Published : 19/08/2021 23:39 IST

President Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కంటికి శస్త్రచికిత్స

దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కంటికి శస్త్రచికిత్స జరిగింది. గురువారం ఉదయం దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో రాష్ట్రపతి కోవింద్‌కు కంటి శుక్లాల (Cataract) ఆపరేషన్‌ జరిగినట్లు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ విజయవంతమైందని.. ఆస్పత్రి నుంచి రామ్‌నాథ్‌ కోవింద్‌ డిశ్చార్జ్‌ అయినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలాఉంటే, ప్రస్తుతం రామ్‌నాథ్‌ కోవింద్‌ వయసు 75ఏళ్లు. కాగా 2017 జులై 25 నుంచి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత 14వ రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని