New Zealand: ఫైజర్‌ టీకా దుష్ర్పభావాలతో తొలి మరణం!

తాజా వార్తలు

Published : 31/08/2021 01:42 IST

New Zealand: ఫైజర్‌ టీకా దుష్ర్పభావాలతో తొలి మరణం!

న్యూజిలాండ్‌ ఆరోగ్యశాఖ వెల్లడి

వెల్లింగ్టన్‌: కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేస్తోన్న న్యూజిలాండ్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ మహిళ.. దుష్ర్పభావాల కారణంగా మృతి చెందింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ సంబంధిత కారణాలతో చోటుచేసుకున్న తొలి మరణం కూడా ఇదేనని వెల్లడించింది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం ఓ మహిళలో గుండె కండరాల నొప్పి (Myocarditis) సమస్య ఎదురైంది. అదే సమయంలో ఆ మహిళను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించడంతో చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు న్యూజిలాండ్‌ ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ వెల్లడించింది. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోవడం సురక్షితమేనని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనిపించే దుష్ర్పభావాలతో పోలిస్తే ఇన్‌ఫెక్షన్‌ ముప్పు నుంచి ఎంతో రక్షణ కలిగిస్తుందని న్యూజిలాండ్‌ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక న్యూజిలాండ్‌లో కేవలం ఫైజర్‌ కాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లను కూడా పంపిణీ చేస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత సమర్థంగా వైరస్‌ను కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటి. కొన్ని నెలలపాటు కనీసం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడింది. కానీ, గతకొన్ని రోజులుగా అక్కడ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ విజృంభణతో నిత్యం 50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ క్రియాశీల కేసుల సంఖ్య 562కి చేరాయి. దీంతో వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా న్యూజిలాండ్‌లో పలుచోట్ల లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని