మన్మోహన్ జీ..  మీరు త్వరగా కోలుకోవాలి: మోదీ

తాజా వార్తలు

Updated : 14/10/2021 11:31 IST

మన్మోహన్ జీ..  మీరు త్వరగా కోలుకోవాలి: మోదీ

ఎయిమ్స్‌లో మాజీ ప్రధానిని పరామర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

దిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ఇటీవల అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ బుధవారం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 

సోమవారం మన్మోహన్ సింగ్‌కు జ్వరం వచ్చింది. దాన్నుంచి కోలుకున్నా నీరసంగా ఉండటంతో నిన్న సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. కార్డియోన్యూరో యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ఆయన సాధారణ చికిత్సే పొందుతున్నారని, ఎప్పటికప్పుడు ఆ సమాచారం అందిస్తామని పేర్కొంది. 89 ఏళ్ల మన్మోహన్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్ సోకింది. అప్పుడు కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని