ట్విటర్ ప్రొఫైల్ పిక్‌ మార్చిన మోదీ.. ఏం పెట్టారో తెలుసా?

తాజా వార్తలు

Updated : 22/10/2021 10:34 IST

ట్విటర్ ప్రొఫైల్ పిక్‌ మార్చిన మోదీ.. ఏం పెట్టారో తెలుసా?

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తాజాగా తన ట్విటర్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేసి, కీలక మైలురాయి దాటిన వేళ.. ఆ ఘనతను ప్రతిబింబించే చిత్రాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.

ఆ చిత్రంలో కరోనా టీకా వయల్, 100 కోట్ల డోసుల పంపిణీ, కరోనాపై పోరాటం చేసిన యోధులు ప్రతిబింబిస్తున్నారు. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ జనవరి 16న కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల వ్యవధిలో అంటే అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీ అయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా.. ప్రభుత్వం, వైద్య సిబ్బంది, ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని