Vaccination: ఆ రోజు టీకా తీసుకుంటే.. కానుకల వర్షమే..!

తాజా వార్తలు

Updated : 09/10/2021 14:08 IST

Vaccination: ఆ రోజు టీకా తీసుకుంటే.. కానుకల వర్షమే..!

ఎక్కడో తెలుసా..?

చెన్నై: అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కొందరు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం కూడా ఈ తరహా చర్యలకే పూనుకుంది. రాష్ట్రంలో ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు కురిపించనుంది. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్‌ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను అందజేయనుంది. ఈ మేరకు కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా టీకా వేయించుకున్న వారి కోసం జిల్లా యంత్రాంగం లక్కీ డ్రా నిర్వహించనుంది. లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేయనున్నాం’ అని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్‌మెషిన్, వెట్‌ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందజేయనున్నారు. 24 ప్రెజర్‌ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నట్లు చెప్పారు. అలాగే టీకా కేంద్రాలకు లబ్ధిదారుల్ని తీసుకురావడంలో స్వచ్ఛందంగా పనిచేసేవారికి రూ.5 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 25 మంది కంటే ఎక్కువమందిని తీసుకువచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతామన్నారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు. 

టీకా తీసుకోని వారు ఆఫీస్‌కు రావొద్దు...

కరోనా టీకా తీసుకోని ఉద్యోగుల పట్ల దిల్లీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటివరకు కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని ఉద్యోగులు అక్టోబర్ 16 నుంచి కార్యాలయాలకు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఒక్క డోసు అయినా తీసుకున్న తర్వాతే వారికి అనుమతి ఇవ్వనుంది. దానికి సంబంధించి దిల్లీ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని