India Corona: 98.16 శాతానికి చేరిన రికవరీ రేటు

తాజా వార్తలు

Updated : 22/10/2021 10:00 IST

India Corona: 98.16 శాతానికి చేరిన రికవరీ రేటు

మరోసారి తగ్గిన కొత్త కేసులు.. ఎన్నంటే ?

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. అవే హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 18 వేలకు పెరిగిన కేసులు తాజాగా 14 శాతం మేర తగ్గాయి. మరణాలు మాత్రం మరోసారి 200 పైనే నమోదయ్యాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెలువరించింది. 

గురువారం 13,24,263 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,786 మందికి వైరస్ సోకింది. 231 మంది ప్రాణాలు కోల్పోయారు. 18,641 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3.41 కోట్లకు చేరగా.. 3.35 కోట్ల మంది కోలుకున్నారు. 4.53 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,75,745గా ఉంది. ఆ రేటు 0.51 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.16 శాతానికి చేరింది. గతేడాది మార్చి నుంచి ఇదే అత్యధికం.

మరోపక్క నిన్న 61,27,277 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 100 కోట్ల మార్కును దాటింది. ఆ ఘనతను పురస్కరించుకొని నిన్న కేంద్రం భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని