India corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

తాజా వార్తలు

Updated : 22/09/2021 10:42 IST

India corona: 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

మెరుగ్గా రికవరీ రేటు.. 

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరగా... 4.45 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేరళలో 15 వేలు, మహారాష్ట్రలో 3వేల మందికి కరోనా సోకిందని బుధవారం కేంద్రం వెల్లడించింది.

క్రియాశీల కేసులు రోజురోజుకూ తగ్గుతుండటం సానుకూలాంశం. ప్రస్తుతం 3,01,989 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 34 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరాయి. కాగా, ఆగస్టు చివర్లో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన ఆర్‌ వ్యాల్యూ.. సెప్టెంబర్ మధ్యనాటికి క్షీణించింది. 0.92కి తగ్గడం ఊరటనిస్తోంది.

మరోపక్క నిన్న 75,57,529 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 82,65,15,754కి చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని