India Corona: 30 వేల కేసులు.. 43వేల రికవరీలు

తాజా వార్తలు

Updated : 20/09/2021 11:21 IST

India Corona: 30 వేల కేసులు.. 43వేల రికవరీలు

కొత్తగా నమోదైన మరణాలు ఎన్నంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 30 వేల కేసులు, 300లోపు మరణాలు సంభవించాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. కేరళలో 19 వేలు, మహారాష్ట్రలో 3 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.

24 గంటల వ్యవధిలో 11,77,607 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి.  నిన్న 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా.. 4.45 లక్షల మంది ప్రాణాలు విడిచారు. ఇక నిన్న ఒక్కరోజే 43,938 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.27 కోట్లకు చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య అదుపులో ఉంది. ప్రస్తుతం 3.18 లక్షల మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల రేటు ఒక శాతం దిగువకు చేరి..0.95 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.72 శాతానికి పెరిగింది.

మరోపక్క నిన్న 37,78,296 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 80,85,68,144కి చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని