Corona : 214 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

తాజా వార్తలు

Updated : 10/10/2021 10:07 IST

Corona : 214 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. మరోసారి 20 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* దేశంలో కొత్తగా 18,166 కేసులు వెలుగులోకి వచ్చాయి. 214 రోజుల కనిష్ఠానికి ఇవి చేరాయి.

* నిన్న 214 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,589కి చేరింది.

కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. గడిచిన 24 గంటల్లో 23,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 3.32 కోట్లు దాటి.. దాని రేటు 97.99 శాతానికి పెరిగింది.

* ఇక క్రియాశీల కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 2,30,971(0.68శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 94.7కోట్లు దాటింది. త్వరలో వంద కోట్ల మార్కను దాటేందుకు రాష్ట్రాలు సమాయత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని