India Corona: 30 వేల దిగువకు కొత్త కేసులు..

తాజా వార్తలు

Updated : 12/09/2021 12:47 IST

India Corona: 30 వేల దిగువకు కొత్త కేసులు..

దిల్లీ : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 30 వేల దిగువకు కొత్త కేసులు చేరడం కాస్త ఊరటనిస్తోంది. ఇక మరణాలు మాత్రం 300కుపైనే నమోదయ్యాయి. మరోవైపు కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో కొత్తగా 20,487 కేసులు నమోదు కాగా.. 181 మరణాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,30,125 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 28,591 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* నిన్న 338 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,42,655కి చేరింది.

*కొత్తకేసుల కంటే రికవరీలే అధికంగా నమోదయ్యాయి. నిన్న 34,848 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.51%గా ఉంది.

* ప్రస్తుతం దేశంలో 3,84,921(1.16%) క్రియాశీల కేసులు ఉన్నాయి.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 72,86,883 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 73.82 కోట్లకు చేరింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని