Modi: వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ

తాజా వార్తలు

Published : 15/07/2021 11:38 IST

Modi: వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తన సొంత నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం వారణాసి చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర గరవ్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆదిత్యనాథ్ ఈ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసి.. రాష్ట్ర ప్రజలందరి తరఫున మోదీకి ఆహ్వానం పలికారు. 

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు.. రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే  జపాన్ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘రుద్రాక్ష్‌’ను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని