Mamata Banerjee: దానిపై మోదీ లేఖ రాస్తా..

తాజా వార్తలు

Published : 15/07/2021 22:17 IST

Mamata Banerjee: దానిపై మోదీ లేఖ రాస్తా..

సమయమిస్తే.. ప్రధానిని కలుస్తాన్న దీదీ

కోల్‌కతా: తమ రాష్ట్రానికి తగినన్ని టీకాలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. టీకా పంపిణీలో అసమానతలపై కలుగజేసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానని గురువారం ఆమె వెల్లడించారు. ‘మా రాష్ట్రానికి 14 కోట్ల డోసులు కావాల్సి ఉండగా.. ఆ స్థాయిలో కేటాయింపులు దక్కడం లేదు. 2.12 కోట్ల డోసులు మాత్రమే అందాయి. మాకు నెలకు రెండు కోట్ల డోసులు అందించాలి. ఆ స్థాయిలో కేంద్రం పంపిణీ చేస్తేనే.. అర్హులందరికీ టీకా వేయడానికి ఆరు నెలల సమయం పడుతుంది’ అని మమత వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు 18లక్షల డోసుల్ని సొంతంగా కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొన్ని రాష్ట్రాలకు భారీ సంఖ్యలో టీకాలు అందుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలకు తగినన్ని కేటాయింపులు దక్కడం లేదని ఆరోపించారు.  

సమయమిస్తే.. ప్రధానిని కలుస్తా..
పశ్చిమ్‌ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, మమత మరోసారి అధికారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆమె దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ సమయంలో ఆమె జులై నెల చివర్లో దిల్లీలో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘ఎన్నికల తర్వాత నేను దిల్లీకి వెళ్లలేదు. ఇప్పుడు కొవిడ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో దిల్లీకి వెళ్లి, మిత్రుల్ని కలుస్తాను. నాకు సమయం ఇస్తే.. రాష్ట్రపతి, ప్రధానిని కూడా కలుస్తాను’ అంటూ మమత సమాధానమిచ్చారు. జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని