Singhu border incident: మృతుడు రోజుకూలీ.. ముగ్గురు పిల్లలు 12 ఏళ్ల లోపువారే..!

తాజా వార్తలు

Published : 15/10/2021 18:32 IST

Singhu border incident: మృతుడు రోజుకూలీ.. ముగ్గురు పిల్లలు 12 ఏళ్ల లోపువారే..!

నిందితుల్ని త్వరలో అరెస్టు చేయనున్నట్లు చెప్పిన పోలీసులు

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తోన్న సింఘు సరిహద్దులో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన వేదిక వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. కాగా, ఈ కేసులో నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 

‘ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోస్టుమార్టం జరుగుతోంది. మా వద్ద అనుమానితుల వివరాలున్నాయి. త్వరలో అరెస్టు చేయబోతున్నాం’ అని హరియాణా పోలీసు అధికారి సందీప్ ఖిర్వార్ వెల్లడించారు. ‘ఈ రోజు ఉదయం ఐదు గంటల సమయంలో దారుణ స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని గుర్తించాం. ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలను సేకరించాం’ అని మరో అధికారి తెలిపారు. 

మృతుడు రోజుకూలీ.. ముగ్గురు పిల్లలు: పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. మృతి చెందిన వ్యక్తి పేరు లాఖ్‌బీర్ సింగ్. అతడు దళితుడని, ఎటువంటి నేర చరిత్ర లేదని చెప్పాయి. అలాగే ఏ రాజకీయ పార్టీతోనే సంబంధం లేదని పేర్కొన్నాయి. లాఖ్‌బీర్ సింగ్ పంజాబ్‌లోని చీమా కుర్ద్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి. రోజుకూలీనే అతడి జీవనాధారం. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వారు 8, 10, 12 ఏళ్ల వయసు వారే. అతడిని హర్నామ్ సింగ్‌ అనే బంధువు ఆరు నెలల వయస్సులో దత్తత తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కన్నతండ్రి పేరు మాత్రం దర్శన్‌ సింగ్. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని