Maglev train: నేలమీద విమానం!

తాజా వార్తలు

Updated : 21/07/2021 07:31 IST

Maglev train: నేలమీద విమానం!

600 కి.మీ. వేగంతో చైనా రైలు

బీజింగ్‌: గంటకు 600 కి.మీ.ల వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్లెవ్‌ రైలును చైనా మంగళవారం ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదేనని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తూర్పు చైనా ప్రాంతంలోని షిడాంగ్‌ ప్రావిన్స్‌ కిండావ్‌ నగరంలో ఈ సరికొత్త మాగ్లెవ్‌ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్‌ 2016లో ప్రారంభించిన మాగ్లెవ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్‌ రైలును గంటకు 600 కి.మీ. వేగంతో ప్రయాణించేలా 2019లో రూపొందించారు. గత ఏడాది జూన్‌లో ప్రయోగ పరీక్షను విజయవంతంగా పూర్తిచేశారు. పది బోగీలతో నడిచే ఈ రైలులో ఒక్కో బోగీలో వంద మందికిపైగా ప్రయాణించే వీలుంది. చక్రాలతో ప్రయాణించే సంప్రదాయ రైళ్లతో పోల్చితే మాగ్లెవ్‌ రైళ్లు ప్రయాణ సమయంలో పట్టాలను తాకవు. శర వేగంగా ప్రయాణించడంతోపాటు, తక్కువ శబ్దాన్ని వెలువరిస్తాయని ఝుఝౌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతినిధి హీ యున్‌ఫెంగ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని