Belgium: విమానంలో 19 ఏళ్ల యువతి ఒంటరిగా ప్రపంచ యాత్ర

తాజా వార్తలు

Updated : 19/08/2021 11:04 IST

Belgium: విమానంలో 19 ఏళ్ల యువతి ఒంటరిగా ప్రపంచ యాత్ర

అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళగా నిలవడమే లక్ష్యం

కొర్ట్రిజ్క్‌: అతి పిన్న వయసులోనే విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా రికార్డు సృష్టించడానికి 19 ఏళ్ల యువతి సాహసానికి పూనుకుంది. ఒకే సీటున్న లోహ విహంగంలో గాల్లోకి ఎగిరింది. ఈదురుగాలులు, మేఘావృతమైన ఆకాశంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా వెరవక, తల్లిదండ్రులు వీడ్కోలు పలుకుతుండగా బుధవారం ప్రయాణాన్ని ప్రారంభించింది. బెల్జియంలోని కొర్ట్రిజ్క్‌లో ఓ చిన్న విమాన స్థావరం నుంచి నింగికి ఎగిరిన ఆమె పేరు జారా రూథర్‌ఫోర్డ్‌. బెల్జియన్‌-బ్రిటిష్‌ యువతి అయిన జారా రెండు-మూడు నెలల ప్రయాణంలో ఐదు ఖండాలు, 52 దేశాల మీదుగా తన యాత్ర కొనసాగించనుంది. ఇందుకు తన షార్క్‌ స్పోర్ట్‌ మోడల్‌ విమానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంది. అతి తక్కువ వయసులో విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా అమెరికాకు చెందిన షాయెస్టా వయిజ్‌ పేరిట రికార్డు ఉంది. 30 ఏళ్ల వయసులో ఆమె ఆ ఘనత సాధించింది. దాన్ని బద్దలుకొట్టాలని జారా లక్ష్యంగా పెట్టుకుంది.



Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని