Tamil Nadu: అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తాం: ఎంకే స్టాలిన్‌

తాజా వార్తలు

Published : 09/09/2021 20:46 IST

Tamil Nadu: అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తాం: ఎంకే స్టాలిన్‌

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు కె పళనిస్వామి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గత పదేళ్లుగా పాలించిన ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను అమలు చేయడంలో విఫలమైంది. 2021 ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని అమలు చేస్తామని మేం ప్రజలకు హామీ ఇచ్చాం. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున దీన్ని అమలు చేయలేకపోయాం. కానీ, త్వరలో కచ్చితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

కొవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ సమావేశాలకు నిర్వహించడానికి ప్రస్తుతం  సరిపడ స్థలం లేదు. త్వరలో ససెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో ప్రజాప్రతినిధులు భౌతిక దూరం పాటించేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని.. వాటిని ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 13న పూర్తవుతాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని