Tamil Nadu: సీఏఏకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

తాజా వార్తలు

Published : 08/09/2021 23:56 IST

Tamil Nadu: సీఏఏకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2019లో పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ చట్టం రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక నిబంధనలకు అనుగుణంగా లేదన్న సీఎం స్టాలిన్.. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూసేందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో నిర్ధేశించిన లౌకిక నిబంధనలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని స్టాలిన్ వివరించారు.

స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘ఒక దేశ పరిపాలన ఆ దేశ ప్రజల ఆలోచనలు, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాస్వామ్యం పేర్కొంటోంది. కానీ ఈ పౌరసత్వ సవరణ చట్టం మాత్రం శరణార్థులను ఆశ్రయం ఇవ్వకుండా.. మతం, జాతి పేరుతో  వారిపై వివక్ష చూపేలా ఉంది. శ్రీలంక తమిళులు ఇక్కడ పౌరసత్వం పొందే వీలును సీసీఏ అడ్డుకునేలా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ భాజపా మిత్రపక్షం, విపక్ష ఏఐఏడీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ గత నెల తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో సాగు చట్టాలను ఉపసంహరించుకున్న ఏడో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. వ్యవసాయం, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖలపై చర్చల కోసం అసెంబ్లీ సమావేశమైన వెంటనే తీర్మానాన్ని ప్రతిపాదించిన సీఎం స్టాలిన్.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేయగా సభ ఆమోదం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని