close

తాజా వార్తలు

Updated : 27/09/2020 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌ షాక్‌ ఇస్తుంది.. జాగ్రత్త..!

 చైనా మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్చరికలు

ఇంటర్నెట్‌డెస్క్‌

చైనా దళాలు బయటకు చెప్పకపోయినా.. భారత్‌ను వారు చూసే దృష్టి మారింది. 1962 యద్ధం తర్వాత భారత్‌పై మానసికంగా పై చేయి సాధించామని డ్రాగన్‌ భావించింది. కానీ, 1967లో భారత్‌ దళాలు తమ దెబ్బను రుచిచూపించాయి. కానీ, మన వ్యూహాల్లో చిన్నలోపాలను చైనా సొమ్ముచేసుకొంటూ భూభాగాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. డోక్లాం.. అనంతర పరిణామాల్లో భారత్‌ ప్రతిఘటన పెరిగింది. ఆ తర్వాత గల్వాన్‌ ఘటనలో భారత్‌ దళాలు ఏస్థాయిలో ప్రతిఘటించగలవో చైనాకు తెలిసొచ్చింది. అప్పటి నుంచి డ్రాగన్‌ దళాలు భారత్‌ను‌ బలహీనదేశంగా చూడటం తగ్గించుకొన్నాయి. తాజాగా స్పంగూరు సరస్సు వద్ద కీలక శిఖరాలను భారత్‌ దళాలు మెరుపువేగంతో ఆక్రమించుకోవడం డ్రాగన్‌ను షాక్‌కు గురిచేసింది.  ఆ తర్వాత నుంచి భారత్‌ కూడా కీలక చర్చల్లో బలంగా మాట్లాడటం మొదలుపెట్టింది. 

మాజీ సైనిక  జనరల్‌ హెచ్చరిక..

చైనా దళాలు భారత్‌ను‌ ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చైనా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ వాంగ్‌హాంగ్‌యాంగ్‌ హెచ్చరించారు. ఈయన గతంలో నాన్‌జింగ్‌ మిలటరీ రీజియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్‌ షాక్‌ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లిజిన్‌ అనే రక్షణ సంబంధ వ్యవహారాలను ప్రచురించే ఒక సామాజిక మాధ్యమ ఖాతాలో తెలిపినట్లు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు పేర్కొంది. చైనా దళాలకు పోటీగా భారత్‌ కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. వాస్తవానికి ఎల్‌ఏసీ నిర్వహణకు 50 వేల మంది సరిపోతారని.. కానీ భారత్‌ దీనికి అదనంగా మరో లక్షమందిని తరలించిందని వెల్లడించాడు. శీతాకాలంలో దళాల ఉపసంహరణ జరగాల్సి ఉండగా.. దానికి వ్యతిరేకంగా దళాలు పోగవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దళాలు మొత్తం చైనా సరిహద్దులకు 50  కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని.. యుద్ధం మొదలైతే  కొన్ని గంటల్లోనే చైనాలోకి దూసుకు వచ్చే సామర్థ్యం వీటికి ఉందని పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న భారత దళాల అంకెలకు ఆధారాలను వెల్లడించలేదు. 

తైవాన్‌తో ఘర్షణ తలెత్తితే..

చైనా- తైవాన్‌ మధ్య ఘర్షణ చెలరేగి.. అమెరికా రంగంలోకి దిగితే చైనాకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుందని వాంగ్‌ పేర్కొన్నారు. భారత్‌ అదే సమయంలో దాడి చేయవచ్చని అంచనావేశారు. ఇరుపక్షాల మధ్య ఆరో విడత కోర్‌కమాండర్‌ స్థాయి చర్చలు జరిగి సంయుక్త ప్రకటన వచ్చాక.. ఈ ఆర్టికల్‌ రావడం విశేషం.  మరో పక్క హాంకాంగ్‌కు చెందిన సైనిక వ్యవహారాల విశ్లేషకుడు సాంగ్‌ జాంగ్‌పింగ్‌ కూడా దీనిపై స్పందించారు. భారత్‌ తనదిగా భావిస్తున్న ప్రాంతాలు చైనాలో ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

శీతాకాలానికి సిద్ధమవుతున్న భారత్‌..

చైనాతో చర్చలు ఇప్పట్లో తెగేలా లేకపోవడంతో భారత్‌ శీతాకాలంలో సరిహద్దులను రక్షించుకోవడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే ఇక్కడ భారత్‌కు 50 వేల మంది సైనికులు ఉన్నారు. వీరికి మద్దతుగా ట్యాంక్‌లు.. శతఘ్నులు.. వాయుసేన ఉన్నాయి. శీతాకాలంలో పీఎల్‌ఏ దళాలు ఎంత మేరకు వెనక్కు తగ్గుతాయో చూసి ఆ తర్వాత నిర్ణయించుకోవాలని భారత్‌ భావిస్తోంది. 
మరోపక్క చైనా దళాలు అప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ వేస్తుండటంతో భారత్‌ దళాలు కూడా అప్రమత్తమమ్యాయి. శాటిలైట్ల సాయంతో భారత్‌ వైపు నిఘాపెట్టి ఆసమాచారాన్ని చైనా దళాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ ద్వారా పంపనున్నారు. అప్పుడు భారత్‌వైపు బలహీనంగా ఉన్నప్రాంతాలను చైనా ఆక్రమించే ప్రమాదం ఉంది. దీంతో భారత్‌ కూడా దీటుగానే సిద్ధమవుతోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.