​​​​​​ఆ పిల్లలను ఆదుకోండి.. మోదీకి సోనియా లేఖ

తాజా వార్తలు

Published : 20/05/2021 18:34 IST

​​​​​​ఆ పిల్లలను ఆదుకోండి.. మోదీకి సోనియా లేఖ

దిల్లీ: కరోనా సంక్షోభం వేళ అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్యను అందించి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానినరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు మోదీకి గురువారం ఆమె లేఖ రాశారు. కరోనాతో తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దను కోల్పోయిన చిన్నారులను ఆదుకోవాలని, వారికి  దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విషాద సమయంలో వారికి భవిష్యత్‌పై ఆశలు చిగురించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికుందని పేర్కొన్నారు.

కరోనాతో ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులు కోల్పోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారి భవిష్యత్‌ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సోనియా తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తన భర్త రాజీవ్‌ గాంధీ వీటిని నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 661 నవోదయ స్కూళ్లు ఉన్నాయని, వాటిల్లో చిన్నారులకు ఉచిత విద్యను అందించాలని విన్నవించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని