Vaccine: ప్రైవేట్లో టీకా.. స్పందన అంతంతే
close

తాజా వార్తలు

Published : 12/06/2021 15:28 IST

Vaccine: ప్రైవేట్లో టీకా.. స్పందన అంతంతే

దిల్లీ: ఓవైపు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడుతుండగా.. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. గత నెలల్లో ప్రైవేటు ఆసుపత్రులు కేవలం 17శాతం డోసులను మాత్రమే వినియోగించినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మే నెలలో దేశవ్యాప్తంగా 7.4కోట్ల డోసులు అందుబాటులో ఉండగా.. ఇందులో 1.85కోట్ల డోసులు ప్రైవేటుకు కేటాయించినవి. వీటిల్లో 1.29 కోట్ల డోసులను మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేయగా.. కేవలం 22 లక్షల డోసులు మాత్రమే వినియోగించాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే అధిక ధరల కారణంగానే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం లేదని నిపుణులు భావిస్తున్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధరలను కేంద్రం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. సర్వీసు ఛార్జ్‌, ట్యాక్స్‌ కలుపుకొని ప్రైవేట్లో కొవిషీల్డ్‌ ధర రూ.780/డోసు, కొవాగ్జిన్‌ రూ.1410/డోసు, స్పుత్నిక్‌ వి ధర రూ.1,145/డోసుగా ఉన్నాయి. కాగా.. జూన్‌ 21 నుంచి నూతన వ్యాక్సినేషన్‌ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రాలపై టీకా భారం పడకుండా 18ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత టీకా పంపిణీ బాధ్యత కేంద్రానిదే అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మొత్తం ఉత్పత్తిలో 75శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మిగిలిన 25శాతం టీకాలను తయారీదారులు ప్రైవేటు మార్కెట్లో విక్రయించుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని