ఇండియానా పోలిస్‌లో భారీగా కాల్పులు

తాజా వార్తలు

Updated : 16/04/2021 13:46 IST

ఇండియానా పోలిస్‌లో భారీగా కాల్పులు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని ఇండియానా పోలిస్‌లో స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి భారీగా కాల్పలు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు.  ఈ ఘటన ఇండియానా పోలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఫెడెక్స్‌ కొరియర్‌ సేవల సంస్థ వద్ద  చోటు చేసుకొంది.  ఈ విషయాన్ని మెట్రో పోలిస్‌ డిపార్ట్‌మెంట్‌ పబ్లిక్‌ ఇన్ఫ్మర్మేషన్‌ అధికారి విలియమ్‌ యంగ్‌ వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారని ఆంగ్లవార్త సంస్థ ఏఎఫ్‌పీ పేర్కొంది. భారీ సంఖ్యలో గాయపడినట్లు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన సాయుధుడు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఘాతుకానికి ఆ సాయుధుడు ఆటోమేటిక్‌ ఆయుధాన్ని ఉపయోగించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

ఫెడెక్స్‌ ఇండియానా పోలిస్‌ కేంద్రంలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫెడెక్స్‌కు ఉన్న రెండో అతిపెద్ద కేంద్రం. ప్రస్తుతం కాల్పులు జరిగిన భవనం  నుంచి ఉద్యోగులను బయటకు తరలిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని