సౌదీకి అంతర్జాతీయ విమానాలు నిలిపివేత

తాజా వార్తలు

Updated : 07/07/2021 18:27 IST

సౌదీకి అంతర్జాతీయ విమానాలు నిలిపివేత

భారత్‌తో సహా 20 దేశాల నుంచి

దిల్లీ: సౌదీఅరేబియా ప్రభుత్వం భారత్‌ సహా 20 దేశాల నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ఈ నిషేధం అమలులో ఉంటుందని వారు తెలిపారు. దౌత్యవేత్తలు, సౌదీ పౌరులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబీకులు మాత్రమే బయటి దేశాల నుంచి రావచ్చని తెలిపారు. తాత్కాలికంగా ప్రయాణాలు నిషేధించిన జాబితాలో భారత్‌తో పాటు లెబనాన్‌, టర్కీ, ఐర్లాండ్‌, ఇటలీ, పోర్చుగల్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, యూఎస్‌, అర్జంటైనా, బ్రెజిల్, ఇండోనేసియా, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, యూఏఈ ఉన్నాయి. కాగా భారత్‌ నుంచి వచ్చే విమానాలను గతేడాది సెప్టెంబరులోనే సౌదీ నిషేధించింది. ప్రస్తుతం నిషేధించిన జాబితాలోని దేశాల సంఖ్య పెరిగింది. గతేడాది డిసెంబరులో విమానాల ప్రయాణాలను నిషేధించిన సౌదీ జనవరి 3 నుంచి తిరిగి పునరుద్ధరించింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తిరిగి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. కాగా ప్రస్తుతం సౌదీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ సౌదీలో 3.68లక్షల కరోనా కేసులు, 6,400 మరణాలు నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని