అభాగ్యులకు రాజస్థాన్‌ ఆర్థిక భరోసా
close

తాజా వార్తలు

Published : 12/06/2021 20:22 IST

అభాగ్యులకు రాజస్థాన్‌ ఆర్థిక భరోసా

జైపుర్: కొవిడ్‌తో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులు, మహిళలకు రాజస్థాన్‌ ప్రభుత్వం ఊరటనిచ్చే కబురు వినిపించింది. ముఖ్యమంత్రి కరోనా బల్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించనున్నట్టు  అశోక్ గహ్లోత్‌ సర్కారు శనివారం ప్రకటించింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.1 లక్ష అందజేయనున్నట్టు వెల్లడించింది. ఆ చిన్నారులకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు రూ.2,500 చొప్పున భృతిని కూడా అందించనున్నట్లు పేర్కొంది. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత ఉచితంగా ఉన్నత విద్యతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వివరించింది. 

కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు కూడా రాష్ట్ర సర్కారు ఆర్థిక భరోసా కల్పించేందుకు నిర్ణయించుకుంది. వారికి తక్షణ సహాయం కింద రూ.1లక్షతో పాటు నెలకు రూ.1500 పింఛను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌తో వితంతువులుగా మారిన మహిళల పిల్లలకు నెలకు రూ.1000 భృతితో పాటు వారి పుస్తకాలు, యూనిఫాం తదితర ఖర్చుల కోసం నెలకు రూ.2500 అందజేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రవేశాలకు.. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వివరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని