Accident: మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

తాజా వార్తలు

Updated : 04/08/2021 08:35 IST

Accident: మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

బమాకో: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్‌ పేలడంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సుకు ఎదురుగా దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. 

ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ఆఫ్రికా దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్ల కారణంగా ప్రతి లక్ష జనాభాకు 26 మంది చనిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని