‘హెచ్‌-1బి లాటరీతో అమెరికన్లకు నష్టం’

తాజా వార్తలు

Published : 07/02/2021 15:18 IST

‘హెచ్‌-1బి లాటరీతో అమెరికన్లకు నష్టం’

వాషింగ్టన్‌: హెచ్‌-1బి వీసాల జారీ ప్రక్రియను పాత సంప్రదాయ లాటరీ విధానంలో కొనసాగించాలంటూ బైడెన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్‌ సెనేటర్‌ టామ్‌ కాటన్‌ తప్పుపట్టారు. ఈ విధానంతో పెద్ద టెక్నాలజీ సంస్థలకు అమెరికన్లకు బదులు తక్కువ వేతనంతో పనిచేసే విదేశీయులను ప్రభుత్వం బహుమతిగా ఇస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘అమెరికన్లకు బదులు విదేశీ కార్మికులను తక్కువ వేతనానికి తీసుకుంటూ హెచ్‌-1బి వీసా కార్యక్రమాన్ని పెద్ద టెక్‌ సంస్థలు దుర్వినియోగపరుస్తున్నాయి’’ అని కాటన్‌ పేర్కొన్నారు. వేతనాలు, ప్రతిభ ఆధారంగా హెచ్‌-1బి వీసాలు జారీ చేయాలంటూ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నూతన విధానాన్ని బైడెన్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. డిసెంబర్‌ 31 వరకు పాత లాటరీ విధానంతోనే హెచ్‌-1బి వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. 

ఇవీ చదవండి..

ఉప్పొంగిన ధౌలిగంగా నది

దిల్లీలో కొనసాగుతున్న పటిష్ఠ భద్రత!

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని