తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌?

తాజా వార్తలు

Updated : 10/07/2021 19:42 IST

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌?

దిల్లీ: తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న భన్వర్‌లాల్‌ పురోహిత్‌ స్థానంలో రవిశంకర్ ప్రసాద్‌ను గవర్నర్‌గా నియమించనున్నట్టు సమాచారం. ఇప్పటికే భన్వర్‌లాల్‌ పురోహిత్‌ను దిల్లీకి పిలిపించి  చర్చించినట్టు తెలుస్తోంది.  కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఐటీశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్‌ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తమిళనాడు గవర్నర్‌గా నియమించాలని కేంద్రం భావిస్తున్నట్ట సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని