​​​​​​స్టాలిన్‌ సలహా కమిటీలో రఘురామ్‌ రాజన్‌

తాజా వార్తలు

Published : 21/06/2021 21:25 IST

​​​​​​స్టాలిన్‌ సలహా కమిటీలో రఘురామ్‌ రాజన్‌

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే విషయంలో ఐదుగురు ప్రముఖులతో కూడిన ఓ ఆర్థిక సలహా మండలిని నియమించారు. ఈ మండలిలో నోబెల్‌ బహుమతి గ్రహీత ఎస్తేర్‌ డూఫ్లో, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక, సామాజిక విధానాల విషయంలో ముఖ్యమంత్రికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ మండలిలో భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌,  ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌ నారాయణ్‌ ఉన్నారు. ‘‘గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు క్షీణించింది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలి. అందుకు తగిన సలహాలను ఈ మండలి అందిస్తుంది’’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశప్రసంగంలో గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ ఈ మండలి ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. వచ్చే నెల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని