Plane Crash: ఘోరం.. గాల్లో మంటలు.. కుప్పకూలిన మిలిటరీ విమానం

తాజా వార్తలు

Published : 17/08/2021 17:11 IST

Plane Crash: ఘోరం.. గాల్లో మంటలు.. కుప్పకూలిన మిలిటరీ విమానం

మాస్కో: రష్యాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైన్యానికి చెందిన ఓ కొత్త విమానాన్ని పరీక్షిస్తుండగా.. గాల్లోనే మంటలు చెలరేగి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మాస్కో శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. 

రష్యా సైన్యానికి చెందిన ఓ కొత్త తేలికపాటి రవాణా విమానాన్ని మాస్కో సమీపంలోని కుబింకా ఎయిర్‌ఫీల్డ్‌లో టెస్ట్‌ చేశారు. ఈ విమానం తిరిగి ల్యాండ్‌ అవుతుండగా..  ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు తలెత్తాయి. మంటలతోనే కొంతసేపు ప్రయాణించిన విమానం.. ఆ తర్వాత తలకిందులై కిందపడిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు టెస్ట్‌ పైలట్లు, ఫ్లైట్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను బజా అనే ఆన్‌లైన్‌ మీడియా పోర్టల్‌ సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తామని రష్యా ఎయిర్‌ ట్రాఫిక్‌ అథారిటీ వెల్లడించింది. మిలిటరీ సిబ్బంది, పరికరాలు, ఆయుధాల రవాణా కోసం ఇల్యూషిన్‌ అనే సంస్థ ఈ విమానాన్ని తయారుచేసింది. ఈ నెలాఖరులో జరిగే ఆర్మీ-2021 కార్యక్రమంలో ఈ విమానాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఇందుకోసం నేడు పరీక్షలు నిర్వహించగా.. ప్రమాదవశాత్తూ కూలిపోయింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని