అట్టుడుకుతున్న రష్యా!

తాజా వార్తలు

Published : 24/01/2021 10:59 IST

అట్టుడుకుతున్న రష్యా!

మాస్కో: ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ విడుదల కోసం జరుగుతున్న ఆందోళనలతో రష్యాలోని ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. నావల్నీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఆందోళనలకారులను నిలువరించేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్​, యెకాటెరిన్బర్గ్​, యుజ్నో-సఖాలిన్స్క్‌ సహా మొత్తం 90​ నగరాల్లో దాదాపు 3000 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్టయిన వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు.

2014లో నావల్నీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 17న స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి...

హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు పాకిస్థాన్‌లో జైలు శిక్ష

భారత్‌లో డ్యామ్‌లకు కాలం చెల్లుతోంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని