రాష్ట్రపతితో ప్రధాని మోదీ కీలక భేటీ 

తాజా వార్తలు

Updated : 15/07/2021 21:35 IST

రాష్ట్రపతితో ప్రధాని మోదీ కీలక భేటీ 

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. వారణాసి పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న మోదీ.. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కోవింద్‌తో భేటీ కావడం గమనార్హం. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్టు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. ఏయే అంశాలను రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం పేర్కొనలేదు. మరోవైపు, ఈ నెల 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

గురువారం ఉదయం కాశీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.1500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని