Modi: కేంద్ర కేబినెట్‌ కమిటీల్లో మార్పులు

తాజా వార్తలు

Updated : 13/07/2021 13:11 IST

Modi: కేంద్ర కేబినెట్‌ కమిటీల్లో మార్పులు

దిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్‌ కమిటీలను ప్రధాని నరేంద్ర మోదీ పునర్‌వ్యవస్థీకరించారు. కొత్త, పాత మంత్రులతో మార్పులు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తున్న అత్యంత ప్రాధాన్యం ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘంలో స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, శర్వానంద సోనోవాల్‌, మన్‌సుఖ్‌ మాండవీయకు చోటు దక్కింది. 

ఇక రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల ఉప సంఘంలో అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజు, వీరేంద్ర కుమార్‌లను నియమించారు. మంత్రి వర్గంలో చోటు కోల్పోయిన రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌ స్థానంలో అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజులకు బాధ్యతలకు అప్పగించారు. నైపుణ్య వ్యవహారాల ఉప సంఘంలో ఆర్సీపీ సింగ్‌, అశ్వనీ చౌబే, భూపేంద్రయాదవ్‌, కిషన్‌రెడ్డిలను ప్రధాని మోదీ నియమించారు.

ఇక దేశ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ-భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి జైశంకర్ సుబ్రహ్మణియన్‌ కొనసాగుతున్నారు. అలాగే మోదీ, షాలతో కూడిన నియమకాల కమిటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాధిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్‌, నారాయణ్‌ రాణెకు పెట్టుబడులు-వృద్ధికి సంబంధించిన కేబినెట్‌ కమిటీలో చోటు దక్కింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని