బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

తాజా వార్తలు

Updated : 20/01/2021 23:55 IST

బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

దిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇరు దేశాల భాగస్వామ్యం బలోపేతానికి బైడెన్‌తో కలిసి పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు. 

ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల బంధం మరింత బలోపేతమవుతుందని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

కొత్త అధ్యాయం మొదలైంది: రాహుల్‌
బైడెన్‌, కమలాహారిస్‌కు కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైందని రాహుల్‌ అన్నారు.

ఇవీ చదవండి..

 

అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణం

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని