Independence Day: మీ ఆలోచనలు..ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి

తాజా వార్తలు

Published : 30/07/2021 17:33 IST

Independence Day: మీ ఆలోచనలు..ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి

నా ప్రసంగంలో మీ సూచనలను భాగం చేయండని ప్రధాని పిలుపు

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోన్న తరుణంలో దేశ ప్రజలు విలువైన సూచనలు ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగంలో వాటిని భాగం చేయనున్నట్లు శుక్రవారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.  ‘మీ ఆలోచనలు ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రతిధ్వనిస్తాయి. ఆగస్టు 15న ప్రధాని నరంద్ర మోదీ ప్రసంగం కోసం మీరు ఏ సూచనలు ఇస్తారు? వాటిని mygovindiaలో పంచుకోండి’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. ఎర్రకోట, ప్రధాని మోదీ ఉన్న చిత్రాన్ని దానిలో పొందుపర్చింది. ప్రధాని తన ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలను వివరిస్తారని mygov పోర్టల్ పేర్కొంది. ఎప్పటిలాగే ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవాలని ఆహ్వానించింది. ఈ పోర్టల్ ప్రభుత్వం, పౌరులను భాగస్వామ్యం చేసే వినూత్న వేదిక.  



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని