ప్రధాని మోదీ, బైడెన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ

తాజా వార్తలు

Updated : 27/04/2021 05:33 IST

ప్రధాని మోదీ, బైడెన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. అమెరికా, ఈయూ, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలు ఈ కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటామంటూ పేర్కొన్నాయి. కరోనా టీకా కొవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడిపదార్థాలు పంపిస్తామంటూ అమెరికా  ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ జరిగింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇరు దేశాల్లో కరోనా పరిస్థితిని చర్చించాం. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన బైడెన్‌కు ధన్యవాదాలు. వ్యాక్సిన్‌ ముడి పదార్థాల సమర్థవంతమైన సరఫరా ప్రాముఖ్యతపై కూడా చర్చించాను. ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19 మహమ్మారి సంక్షోభాన్ని భారత్‌-అమెరికా ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యం పరిష్కరించగలదు’’ అని ప్రధాని ట్విటర్‌లో తెలిపారు. 

కరోనా చికిత్సలో వాడే వెంటిలేటర్లు, కిట్లు, వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన ముడిపదార్థాలను అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్‌లో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్టవేయడానికి వేగవంతమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, అత్యవసర మందులు సరఫరాపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని